చెట్టుకు పూసిన పూలు వాడిపోక మానవు. అలాగే, పుట్టిన ప్రతి మనిషిలో వృద్ధాప్యం రాకమానదు. ఇదంతా సృష్టిధర్మంలో భాగం. ప్రతి ఇంట్లోనూ ముసలివాళ్లుండటం సర్వసాధారణం. అన్ని దశల మాదిరిగానే వృద్ధాప్యం వస్తుంది. ఇది అచ్చం పసితనం మాదిరిగానే ఉంటుంది. ఆత్మీయుల కోసం ఎదురు చూస్తుంటారు. మనవలు, మనవరాళ్లతో ఆడుకోవాలని ఉబలాటపడుతుంటారు. ఒకరోజు మనమూ వృద్ధులమవ్వాల్సిందే అన్నది మరిచిపోవద్దని చెప్పడానికే ఏటా ఆగస్టు 21న జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటుంటాం.