ప్రతి ఏటా ఆగస్టు 21న జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1988, ఆగస్టు 19న అమెరికా దేశ 40వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఈ ప్రకటనపై సంతకం చేసి ఆగస్టు 21న జాతీయ దినోత్సవాన్ని ప్రకటించారు. ఈరోజు వృద్ధుల నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ప్రత్యేకతపై.. వారి సమస్యల పరిష్కారాల మీద తీసుకోవాల్సిన పనులపై, కుటుంబీకుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, ఫించన్లపై, ఉచిత వైద్యంపై.. ఈ రోజున నిర్వహించే సమావేశాల్లో చర్చిస్తారు.