మెట్ పల్లి గ్రామంలో దళిత కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులు

2903చూసినవారు
మెట్ పల్లి గ్రామంలో దళిత కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులు
శంకరపట్నం మండల పరిధిలోని మెట్ పల్లి గ్రామంలో ఓ దళిత కుటుంబంపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ మేరకు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది వివరాల్లోకి వెళితే మెట్ పల్లి గ్రామానికి చెందిన కొండ్ర సురేష్ అనే వ్యక్తి ఆర్ఎంపి వైద్యుడుగా పనిచేస్తున్నాడు. కాగా గురువారం రాత్రి అతడు భోజనం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన భోనగిరి సంపత్, భోనగిరి సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు తలుపు వేసి అతడి పై దాడి చేశారు. అడ్డోచ్చిన సురేష్ భార్య శారదాపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి దాడి చేసారు. వీరేకాక భోనగిరి రవి, పచ్చిమట్ల ఎల్లయ్య గ్రామంలోని సెల్ షాపు వరకు తీసుకు వచ్చి చితకబాదారు. ఈ మేరకు వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్