ధర్మారంలో యువకుడి ఆత్మహత్య

4809చూసినవారు
ధర్మారంలో యువకుడి ఆత్మహత్య
ధర్మారం మండల కేంద్రంలో ఓ యువకుడు గురువారం నాడు రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే ధర్మారంకు చెందిన కంసాని సాగర్ అనే 32 ఏళ్ల యువకుడుకి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మూడు రోజుల క్రితం అతడి భార్య తన సౌమ్య పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలో సాగర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా సాగర్ రెండు సంవత్సరాల నుంచి సిద్దిపేటకు చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, సదరు యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో భార్య సౌమ్య పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్