కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కరీంనగర్‌ రావాలి: బండి సంజయ్

63చూసినవారు
కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కరీంనగర్‌ రావాలి: బండి సంజయ్
కేసీఆర్ కరీంనగర్ పర్యటనపై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'రైతుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతులకు పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ కరీంనగర్‌లో అడుగు పెట్టాలి. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. రైతులకు భరోసా కల్పించడం కోసమే దీక్ష చేస్తున్నా' అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్