ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. చలి తీవ్రత ఉన్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో అనుబంధ ఆలయాల్లో సైతం భక్తుల తాకిడి నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.