బోయిన్‌పల్లి మండలం అనంతపల్లిలో నీటి చెరువులో చేపలు మృతి చెందడం పై డీఎఫ్వో సౌజన్య స్పందించి శుక్రవారం చెరువును పరిశీలించారు. ఎలా జరిగింది, ఎవరైనా కక్షపూరితంగా చేశారా.? అనే కోణంలో పరిశీలించారు. చెరువులోని నీటిని ల్యాబ్కు పంపించి పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట ముదిరాజ్ యూత్ నాయకులు ఉన్నారు.