నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ

80చూసినవారు
నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ
రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలోని దాసరి రాజు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరిది చాలా బీద కుటుంబం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 25 కేజీల రెండు రైస్ బ్యాగుతో పాటు నిత్యావసర సరుకులు నిరుపేద కుటుంబానికి బుధవారం సేవా సంస్థ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షులు దాసరి కనకయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి రవి శాస్త్రి, జాయింట్ సెక్రెటరీ వడ్లురి సిద్ధూ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తడగొండ మల్లేశం, సేవా సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్