గత మూడు రోజులుగా వరుసగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పలు చెరువులు సోమవారం వరకు నిండు కుండల్లా మారాయి. రామడుగు మండలంలోని గుండి చెరువు మత్తడి దుంకుతోంది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొని అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. కాగా, వరుసగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని పలు చెరువులు పూర్తిస్థాయిలో నిండుకున్నాయి.