మల్యాల: రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరపాలి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా చూడాలని జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. మల్యాల మండలం రామన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ధాన్యం మ్యాచరుకు వచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, తాసిల్దార్, ఎంపీడీవో ఉన్నారు.