ఎల్లారెడ్డిపేట: గుండె సంబంధిత వ్యాధితో యువకుడి మృతి

57చూసినవారు
ఎల్లారెడ్డిపేట: గుండె సంబంధిత వ్యాధితో యువకుడి మృతి
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన యువకుడు గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామోజు నవీన్  కొన్ని సంవత్సరాలుగా గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. గురువారం ఉదయం 4 గంటలకు మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్