జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేకువ జామునే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ముందుగా స్థానిక గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.