ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. శనివారం పెగడపెల్లి మండల కేంద్రంలో పలు వార్డులలో ఇళ్లులేని నిరు పేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు. వారి వెంట డిపిఓ రఘు వరుణ్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.