కొత్తూరులో మొదలైన శ్రీరామనవమి వేడుకలు

574చూసినవారు
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం గ్రామస్తులు పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం గ్రామంలో శోభాయాత్రగా వెళ్లి పాలపొరక కార్యక్రమం నిర్వహించారు. బుధవారం స్థానిక హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్