వాగ్దేవిలో జాతీయ క్యాన్సర్ దినోత్సవంపై అవగాహన

143చూసినవారు
వాగ్దేవిలో జాతీయ క్యాన్సర్ దినోత్సవంపై అవగాహన
ఫిబ్రవరి 4వ తేదీన జాతీయ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు క్యాన్సర్ వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుంది, క్యాన్సర్ వ్యాధి నివారణ నిర్మూలన- పర్యావరణ పరిరక్షణ అంశాల పైన అవగాహన కల్పించారు. శ్రీ మాధవి నర్సింగ్ హోమ్ హుజురాబాద్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జనరల్ ఫిజీషియన్ వాగ్దేవి కళాశాలకు అతిథిగా విచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై క్యాన్సర్ నిర్మూలనపై పలు వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తాయని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్