జమ్మికుంట పరిసర ప్రజలకు సుపరిచితులైన విశ్రాంత వైద్యాధికారి డా. జీడి అంకూస్ ఆదివారం హార్ట్ స్ట్రోక్ తో జమ్మికుంటలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి దానమిచ్చారని వారి హాస్పిటల్ సిబ్బంది మైస అరవింద్ ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. పేద ప్రజలకు డాక్టర్ గా ఆయన సేవలు మరువలేనివని అరవింద్ గుర్తు చేశారు.