హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆదివారం పర్యటించారు. అంబల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎల్లప్పుడూ తాము పనిచేస్తూనే ఉంటామని హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రణవ్ తో కలిసి తాను సమిష్టిగా పనిచేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి తాళం పెట్టే సమయం దగ్గర పడిందని హెచ్చరించారు.