వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన మొగిలి అనే రైతు ప్రమాదవశాత్తు కాలు జారి వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం బావి దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావి నుంచి తీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.