జగిత్యాల: మల్లాపూర్ మండలం వెంకట్‌రావుపేటలో భార్యను భర్త హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రమేశ్‌కు పదేళ్ల కిత్రం సునీతతో వివాహమైంది. రమేష్ బతుకు దెరువుకోసం గల్ఫ్ దేశం వెళ్లాడు. ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగి వచ్చినా రమేశ్ భార్యపై అనుమానంతో బుధవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో సునీత తలను బలంగా గోడకు కొట్టాడు. దీంతో సునీత అక్కడిక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.