బీర్పూర్ మండల కేంద్రంలో గ్రామ ఉపాధి హామీ కూలీలను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, ఎన్నికల ఇంచార్జి లోక బాపు రెడ్డితో కలిసి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ కూలీలు 150 రోజుల పని దినాలు 350రూపాయల కూలీ పెంచే వరకు వారి పక్షాన పోరాడతాం అన్నారు.