ఎల్ఐసి బోనస్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఎల్ఐసి బోనస్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎల్ఐసీ ఏజెంట్ గా పరిచయం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి బోనస్ వచ్చిందంటూ బాధితుడిని నమ్మించాడు. అయితే బోనస్ గా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అకౌంట్లో క్రెడిట్ అయినట్లుగా ఓ ఫేక్ మెసేజ్ పంపించి చెప్పే సూచనలు పాటించాలని ఫోన్ పే ద్వారా రూ. 60 వేలు కొట్టేశాడు. ఖంగుతిన్న బాధితుడు మోసపోయినట్టుగా గ్రహించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.