వేములవాడ: ప్రతి బూత్ స్థాయిలో సభ్యత్వం నమోదు చేయించాలి
బూత్ స్థాయిలో బీజేపీ సభ్యత్వం ఎక్కువగా నమోదు చేయాలని వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి చెన్నమనేని వికాస్ రావు తెలిపారు. ఆదివారం కోనరావుపేట మండల కేంద్రంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. సభ్యత్వ నమోదులో వేములవాడ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయాలన్నారు.