జగిత్యాల జిల్లా వాసి సౌదీలో గుండెపోటుతో మృతి

13959చూసినవారు
జగిత్యాల జిల్లా వాసి సౌదీలో గుండెపోటుతో మృతి
ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశం వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన నిమ్మ రాజశేఖర్(36) సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 3న తను ఉంటున్న గదిలో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించగా. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజశేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్