రైతులకు అవగాహన సదస్సు

279చూసినవారు
రైతులకు అవగాహన సదస్సు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో వ్యవసాయ శాఖ వారిచే నియంత్రిత పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఓ నాగమణి మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా సగం భాగం సన్న రకం, సగం దోడ్డు రకం వరి సాగు చేయాలని సూచించారు. అదే విధంగా సబ్సిడీలో పచ్చిరొట్ట, ఇతర విత్తనాలు వ్యవసాయ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయని, రైతులు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా మొక్కజొన్న సాగుకు బదులుగా కందులు వేసుకోవాలని సూచించారు. పామాయిల్ సాగు చేసే వారికి 90% సబ్సిడీ వస్తుందని ఎవరైనా పామాయిల్ సాగు చేయాలనుకుంటే వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటి వెంకట్రావు, యెకిన్ పూర్ పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చిట్టిరెడ్డి నారాయణ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి ఖయ్యూం, ఏఈవో నరేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్