జాతీయస్థాయి ప్రదర్శనకు గోదూరు విద్యార్థి ఎంపిక

56చూసినవారు
జాతీయస్థాయి ప్రదర్శనకు గోదూరు విద్యార్థి ఎంపిక
ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నవ్య శ్రీ అనే విద్యార్థి రూపొందించిన అడిస్టబుల్ పోడియం అనే ఆవిష్కరణను ఈనెల 15, 16న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచి, రెండో స్థానంలో నిలవడంతో జాతీయ స్థాయి ప్రదర్శనకు నవ్య శ్రీ రూపొందించిన ఆవిష్కరణ ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధు తెలిపారు. నవ్య శ్రీని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్