నాగులపేటను సందర్శించిన జాయింట్ కలెక్టర్

457చూసినవారు
నాగులపేటను సందర్శించిన జాయింట్ కలెక్టర్
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో జాయింట్ కలెక్టర్ రాజేషం పర్యటించారు. గ్రామంలో జరిగే పలు అభివృద్ధి పనులను సందర్శించి పర్యవేక్షించారు. గ్రామంలోని ఉపాధి పని కూలీలకు, గ్రామ ప్రజలకు ప్రతిమ ఫౌండేషన్ వారు అందించిన మాస్క్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, ఎంపీడీవో, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ వసంత-స్వామి, గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్