కథలాపూర్: ఘనంగా సామూహిక కుంకుమార్చన పూజలు

66చూసినవారు
కథలాపూర్: ఘనంగా సామూహిక కుంకుమార్చన పూజలు
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో శనివారం పురోహితులు నారంభట్ల నరేష్ శర్మ ఆధ్వర్యంలో దుర్గామాత సన్నిధిలో భక్తిశ్రద్ధలతో సామూహిక కుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షతో ఉండి కుంకుమార్చనను విజయవంతం చేశారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. దుర్గా మండపంలో ఉచితంగా భగవద్గీత పుస్తకాలు సిరికొండ సింగిల్ విండో చైర్మన్ కందరి జీవన్ రెడ్డి అందజేశారు.

సంబంధిత పోస్ట్