కోరుట్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

459చూసినవారు
కోరుట్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 11 కెవి మరమ్మతుల దృష్ట్యా పట్టణంలోని ఝాన్సీ రోడ్, ప్రకాశం రోడ్, గాంధీ రోడ్, ఐలపూర్ రోడ్, తిలక్ రోడ్, పాత బస్ స్టాండ్, నంది చౌరస్తా, వేములవాడ రోడ్, పోలీస్ స్టేషన్, ఎస్బిఐ కోరుట్ల, ఐబి.గెస్ట్ హౌస్, వెంకటేశ్వర టెంపుల్, ఆనంద్ షాపింగ్ మాల్, విజయ్ ఆనంద్ ఫర్నిచర్, కటికె వాడ, బొక్కల దవాఖాన, శ్రీనివాస్ రోడ్, మార్కెట్, బురుజు, కాల్వగడ్డ, పెద్ద మసీదు, తాళ్ల చెరువు గంగంపేట్, అంబేడ్కర్ నగర్, సంగెం రోడ్ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని కోరుట్ల టౌన్-1ఏఈ పిప్పోజి రవి, కోరుట్ల టౌన్-2 జక్కుల అమరెందర్ తెలిపారు. కావున వినియోగదారులను సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్