తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆరవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధించారు. విద్యార్థులతో మమేకమై వారిని పలు విషయాలు అడిగి తెలుసుకుని, సిలబస్ గురించి ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు. విద్యార్థులు సరైన జవాబులు ఇవ్వడంతో ఉపాధ్యాయుల బోధన పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు.