కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఎంఎల్ హెచ్ పి వైద్య బృందం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డా. గొట్టే శ్రావణ్ మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు థైరాయిడ్, డయాబెటిస్, గర్భకోశ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి, క్యాన్సర్ లాంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.