మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ కళాశాలలో గురువారం క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వసంతి, పిటి షబీర్ పషా మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లో కూడా పాల్గొంటేనే శరీరక అలసట పోయి శరీరం ఫిట్గా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని, విద్యార్థులకు క్రీడాకారులకు క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.