పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. చిన్న ఓదాల గ్రామంలో మాజీ ఎంపీ వివేక్ బిజెపి జెండా ఆవిష్కరించారు. రేండ్ల సనత్ కుమార్ ఆధ్వర్యంలో 500 మందికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మంథని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.