ఇన్ స్పైర్ అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం

53చూసినవారు
ఇన్ స్పైర్ అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇన్ స్పైర్ అవార్డులకై జిల్లాలోని విద్యార్థుల నుండి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర- సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఇన్ స్పైర్ అవార్డ్స్ మనాక్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ఆన్ లైన్ లో నమోదుకి గడువు సెప్టెంబర్ 15 వరకు ఉందన్నారు.

సంబంధిత పోస్ట్