మంథని మండలం అడవిసోమన్ పల్లికి చెందిన కడారి లక్ష్మి(51) బుధవారం గడ్డికోయడానికి పొలం దగ్గరికి వెళ్ళింది. ఒడ్డు మీద ఉన్న బోర్ వైర్ ను గమనించక వైర్ కూడా కోయడంతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.