డ్యూటీ వేళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

83చూసినవారు
డ్యూటీ వేళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్
డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే ప్రభుత్వ వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డిప్యూటీ సివిల్ సర్జన్ గైనకాలజి స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అయేషా ఉస్మాన్ ఎమర్జెన్సీ సేవలలో నిర్వహించే విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్