జామ పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల.. అవి కాయలలో రసం కోల్పోయి క్రమంగా ఎండిపోతాయి. ఎక్కువ రోజులు జామకాయలను ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే ఇవి వీటి రుచి కూడా ఉండవు. పనస మరియు అరటి పండ్లు రుచిని మరియు ఆకృతిని కోల్పోతాయి. ఫ్రిడ్జిలోని తక్కువ ఉష్ణోగ్రత కారణంగా ఇవి వాటి సహజసిద్దమైన రుచిని మరియు వాసనను కోల్పోతాయి. అలాగే మామిడి పండ్లను కూడా ఫ్రిడ్జిలో పెడితే కొన్ని రోజులకి ఎండిపోయినట్లు కనిపిస్తాయి, అంతేకాకుండా రుచి కూడా తగ్గిపోతుంది.