మంథని మున్సిపాలిటీ కి సంబంధించిన రెండు సంవత్సరాల ఆదాయ - వ్యయాలు, సిబ్బంది వివరాలు, సమావేశాల తీర్మాణాలు ,మెప్మా వివరాలు, సిబ్బంది జీత భత్యాలు, మున్సిపల్ పరిధిలో జరిగిన వివిధ నిర్మాణాల పనుల వివరాలు, నూతన గృహ నిర్మాణ అనుమతులు వంటి వివిధ విషయాల గురించి సమాచార హక్కు ద్వారా పూర్తి వివరాలు కావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ ఆర్టిఐ దాఖలు చేసారు. అయినప్పటికీ అధికారులు పూర్తి సమాచారం ఇవ్వలేదు. కేవలం సంక్షిప్త సమాచారం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఇనుముల సతీష్ పూర్తి సమాచారం కొరకు రాష్ట్ర సమాచార కమిషన్ కు అప్పీల్ చేసారు. అప్పీల్ కు స్పందించిన రాష్ట్ర సమాచార కమిషన్ మంథని మున్సిపల్ కమిషనర్ ను ఈ నెల 22న స్వయంగా హాజరు కావాలని నోటీసులు అందించారు.అప్పీల్ కు స్పందించిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కు ఇనుముల సతీష్ ధన్యవాదాలు తెలిపారు.