అనుమతులు లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు

74చూసినవారు
అనుమతులు లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు
సుల్తానాబాద్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కె. ప్రమోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న పిల్లల ఆసుపత్రి, రెండు దంత వైద్యశాలలకు నోటిసులిచ్చి అనుమతులు పొందే వరకు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్