కాటారం ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఇస్లావత్ నరేశ్ ను ఆదివారం మండల ఆర్టీఐ రక్షణ వేదిక ఘనంగా సన్మానం చేశారు. సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక మండల అద్యక్షులు బుర్ర రాజబాపుగౌడ్, గౌరవ అద్యక్షులు నారమల్ల సారయ్య ఆద్వర్యంలో పోలీసు స్టేషన్ లో కలిసి పుష్ప గుచ్చం అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఎస్సైగా భాద్యతలు చేపట్టిన నరేష్ కు కమిటి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొడ్డు రాజబాపుయోనా, సహాయ కార్యదర్శి మెండ మల్లయ్య, సభ్యులు సిరిసిల్ల నరేష్, బయ్యారం గ్రామ కమిటీ ప్రెసిడెంటు జాగిరి సాంబం గౌడ్ పాల్గొన్నారు.