ఘనంగా ఉగాది వేడుకలు

80చూసినవారు
ఘనంగా ఉగాది వేడుకలు
పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్ గ్రామంలో మంగళవారం శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ ఉగాది పండగ సందర్బంగా శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. గోమాతకు పూజ చేసి ఉగాది షడ్రుచుల పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ మిట్టపల్లి శ్రీనివాస్, సీపెల్లి శ్రీనివాసచారి, గంటి నందం, నిమ్మల నరేష్, అశోక్, కృష్ణమాచారి, సంపత్, దివిన్, సదానందం, రాయలింగు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్