డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద సౌకర్యాల కల్పన: జిల్లా కలెక్టర్

61చూసినవారు
డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద సౌకర్యాల కల్పన: జిల్లా కలెక్టర్
రెండు పడక గదుల ఇండ్ల వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌళిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లిలోని కూనారం రోడ్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సందర్శించారు. ఇండ్ల నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్