పకడ్బందీగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలి: కలెక్టర్

1714చూసినవారు
పకడ్బందీగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలి: కలెక్టర్
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ ప్రజలకు అవసరమైన రేషన్ సరుకుల పంపిణీ పకడ్బందీగా చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ బియ్యం పంపిణీ, వలస కార్మికులకు ఆర్థిక సహాయం, దాన్యం కొనుగోలు ఏర్పాటు సంబంధిత అంశాలపై పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్