ఎమ్మెల్యే కృషితో రోడ్డుకు మరమ్మత్తులు

65చూసినవారు
ఎమ్మెల్యే కృషితో రోడ్డుకు మరమ్మత్తులు
పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మినృసింహస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఎమ్మెల్యే విజయరమణరావు కృషితో మరమ్మతులు చేపడుతున్నట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్ మియా తెలిపారు. సోమవారం అందుగులపల్లి పెద్దమ్మ ఆలయం నుండి ఆలయం వరకు రోడ్డుపై గుంతలు ఏర్పడగా మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది దృష్ట్యా ఎమ్మెల్యే మట్టి రోడ్డు ఏర్పాటుకు సహకారం అందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్