పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్ శ్రీహర్ష

73చూసినవారు
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్ శ్రీహర్ష
ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ ఎంపిడిఓ కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం, వైరల్ జ్వరాల నివారణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, మండల ప్రత్యేక అధికారి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్