పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెలవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబంలోని ఇద్దరు తండ్రి సతీష్, అతని 11 నెలల కుమారుడు సాత్విక్ మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా గాంధీ నగర్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..