కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి ఎయిర్ పోర్ట్ లు సాధించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం సభలో సీఎం మాట్లాడుతూ పదేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క ఎయిర్ పోర్ట్ ను ముందుకు సాగనీయలేదని, తాము అధికారంలోకి వచ్చాకే 4 ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన పెద్దపల్లికి బస్సు డిపోను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.