జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అన్నయ్య గౌడ్

76చూసినవారు
జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అన్నయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సుల్తానాబాద్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణరావులకు అన్నయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అన్నయ్య గౌడ్ ఎంపిక పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్