దహన సంస్కారాల కోసం ఆర్థిక సాయం అందజేత

4162చూసినవారు
దహన సంస్కారాల కోసం ఆర్థిక సాయం అందజేత
నిరుపేద వృద్ధురాలి దహన సంస్కారల కోసం నీడ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు పల్లెర్ల రమేష్ గౌడ్ ఆర్థిక సహాయం చేసి మానవతను చాటుకున్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చి గోదావరి ఖనిలోని ఇందిరా నగర్ బోర్డు దగ్గర కుమ్మరి పని చేసుకొంటూ జీవనం గడుపుతున్న జీజా భాయ్ అనే మహిళ బుధవారం మృతి చెందింది. దహన సంస్కారానికి కూడా చేయలేని పరిస్థితులలో ఉన్నట్లు సమచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లిన రమేష్ గౌడ్ 'నీడ' నుండి 2 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతలు తమకు తోచిన సహాయం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్