శంకరపట్నంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఈ ఘటన శంకరపట్నం మండలం తాడికల్లో జరిగింది. చిగురుమామిడి మండలం లంబాడిపల్లికి చెందిన బండారిపల్లి వినయ్ కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వెళ్తుండగా.. తాడికల్ మూలమలుపు వద్ద బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో అక్కడకక్కడే మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.