షాపు యజమానులతో ఎంపీడీవో సమావేశం

78చూసినవారు
షాపు యజమానులతో ఎంపీడీవో సమావేశం
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ గురువారం మండల కేంద్రంలోని చికెన్ మటన్ షాప్ల యజమాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కోడి, మేక వ్యర్ధాలు మండల కేంద్రంలోని వాగు ద్వారా కొట్టుకుపోయి ముత్తారం చెరువులో కలిసి చెరువు నీరంతా కలుషితం అవుతుందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అవగాహన కల్పించారు. వ్యర్థాలను వాగులో వేయరాదని వేసినచో జరిమానా విధించబడునని ఎంపీడీవో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్